Saturday, April 20, 2024

ఎసిబి వలలో ఎస్ఐ.. కొనసాగుతున్న సోదాలు

- Advertisement -
- Advertisement -

SI Chandra Shaker in ACB Net in Vikarabad

వికారాబాద్: లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులు ఎస్‌ఐ పట్టుపడ్డాడు.  ఇసుకు అక్రమ రవాణా విషయంలో డబ్బులు డిమాండ్ చేయడంతో ఎసిబిని ఆశ్రయించిన బాధితుడు ప్రజా ప్రతినిధి(ఎంపిటిసి) శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎసిబి అధికారులు పథకం ప్రకారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజులుగా మంబాపూర్ గ్రామానికి చెందిన ఎంపిటిసి శ్రీనివాస్ ఇసుక రవాణా చేసేందుకు ఎస్‌ఐ చంద్రశేఖర్ డబ్బులు డిమాండ్ చేశాడు. ఎన్ని సార్లు వేడుకున్నా వినకపోవడంతో రూ.50వేలు లంచం ఇచ్చేందుకు ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా రూ.20 వేలు అడ్వాన్సుగా చెల్లించాడు. మిగితా రూ.30వేలు కూడా ఇవ్వాల్సిందిగా ఎస్‌ఐ చంద్రశేఖర్ సదరు ఎంపిటిసిని ఇబ్బంది పెట్టాడు. దీంతో ఎసిబి అధికారులను ఆశ్రయించిన శ్రీనివాస్ మంగళవారం పోలీస్ స్టేషన్‌లో రూ.30 వేలు ఇస్తుండగా.. పథకం ప్రకారం వచ్చిన ఎసిబి అధికారులు పక్కా ప్లాన్‌తో స్కెచ్ వేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఎస్‌ఐ ఛాంబర్ తోపాటు అతని నివాసంలో  ఎసిబి అధికారులు సోదాలు చేస్తున్నారు.

SI Chandra Shaker in ACB Net in Vikarabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News