Home ఎడిటోరియల్ సంక్షోభంలో వాహన రంగం

సంక్షోభంలో వాహన రంగం

car sales

 

గత సంవత్సరంతో పోలిస్తే 2019 మే నాటికి వాహనాల అమ్మకాలు 26 శాతం తగ్గాయి. అందువల్ల వాహనాల ఉత్పత్తి 8శాతం తగ్గింది. 2017- 18లో కార్ల అమ్మకాలు 14 శాతం పెరిగితే ఇప్పుడు అవి 5శాతానికి తగ్గాయి. ద్విచక్ర వాహనా ల అమ్మకాలు 15 శాతం పెరుగుతూ ఉంటే 5 శాతానికి పడిపోయింది. కార్లు తయారు చేసే వారు ఉన్న వాటిని అమ్ముకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. గిరాకీ తగ్గినందువల్ల మన దేశంలో కార్ల తయారీ మీద ఎక్కువ ప్రభావం కనిపిస్తోంది. చాలా పరిశ్రమలో తమ ఉత్పాదక శక్తిలో 70శాతం మాత్రమే వినియోగించుకుంటున్నాయి. ఉద్యోగులకు నష్టం కలగకుండా విడతల వారీగా ఉపయోగించుకుంటున్నారు. అదీ కుదరనప్పుడు ఉద్యోగులను తొలగిస్తున్నారు.

వాహన పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభంలో కూరుకుపోయింది. మన దేశానికి సంబంధించినంతవరకు వాహనాల తయారీ పరిశ్రమ త్వరితంగా ఎదుగుతున్న పరిశ్రమగా ఉండేది. వస్తూత్పత్తి రంగానికి చోదక శక్తిగా ఉండేది. 2018లో స్థూల జాతీయ ఉత్పత్తి (జి.డి.పి.) లో ఈ రంగం వాటా 7 శాతం ఉంది. వాహన తయారీ రంగానికి ఇతర రంగాలతో సంబంధం ఉంటుంది కనక అపారమైన ఉపాధి అవకాశాలు కూడా కల్పించింది. వాహన తయారీ పరిశ్రమలో మాంద్యం ఆ రంగంపై మాత్రమే కాకుండా టైర్లు, ఉక్కు, తదితర రంగాలపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. మన దేశంలో వాహనాలకు గిరాకీ తగ్గినందువల్ల గత 19 ఏళ్లల్లో ఎన్న డూ లేనంతగా అమ్మకాలు పడిపోయాయి.

గత సంవత్సరంతో పోలిస్తే 2019 మే నాటికి వాహనాల అమ్మకాలు 26 శాతం తగ్గాయి. అందువల్ల వాహనాల ఉత్పత్తి 8 శాతం తగ్గింది. 2017- 18లో కార్ల అమ్మకాలు 14 శాతం పెరిగితే ఇప్పుడు అవి 5 శాతానికి తగ్గాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 15 శాతం పెరుగుతూ ఉంటే 5 శాతానికి పడిపోయింది. కార్లు తయారు చేసే వారు ఉన్న వాటిని అమ్ముకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. గిరాకీ తగ్గినందువల్ల మన దేశంలో కార్ల తయారీ మీద ఎక్కువ ప్రభావం కనిపిస్తోంది. చాలా పరిశ్రమలో తమ ఉత్పాదక శక్తిలో 70 శాతం మాత్రమే వినియోగించుకుంటున్నాయి. ఉద్యోగులకు నష్టం కలగకుండా విడతల వారీగా ఉపయోగించుకుంటున్నారు. అదీ కుదరనప్పుడు ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకటి: ఈ ధోరణి ముందే పొడసూపిందా? రెండు: దీని పరిణామాలు ఎలా ఉంటాయి?

2016 నాటి ఆటోమేటివ్ మిషన్ ప్రణాళిక ప్రకారం వాహనాల అమ్మకంలో, ముఖ్యంగా ప్రయాణికుల వాహనాలు, ట్రాక్టర్ల అమ్మకాలలో పెట్టుకున్న లక్ష్యాలు సాధించగలిగారు. అదే వాహనాల విడిభాగాల అమ్మకాల లక్ష్యం మాత్రం రూ. 1,20,000 లక్షల మేర తగ్గింది. భారత వాహనాల తయారీదార్ల సంఘం అంచనాల ప్రకారం మన దేశంలో వాహనాల తయారీ, అమ్మకాలు 2013-14లో 8 శాతం ఉంటే 2018- 19లో 7శాతం ఉన్నాయి.

అనియంత్రిత బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం వల్ల డీలర్లకు, వినియోగదార్లకు రుణాలు అందించడం తగ్గిం ది. మన దేశంలో అమ్మే అయిదింట మూడు వంతుల కార్లు రుణం తీసుకునే కొంటారు. గత ఏడాదిన్నరగా రుణాలూ తక్కువే ఇచ్చారు. వాహన రంగంలో మాంద్యానికి గిరాకి తగ్గడమే కాకుండా నియంత్రణ, సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులు కూడా కారణమే. పెట్టుబడులు పెరగడం మరో కారణం.

అనేక నియంత్రణలు అమలు చేసినందున అనిశ్చిత పరిస్థితి ఏర్పడి ధరలలో కూడా మార్పులు వచ్చాయి. మూడేళ్ల దాకా కారుకు బీమా ఉండి తీరవలసిందేనన్న సుప్రీం కోర్టు ఆదేశం, ఉద్గారాల ప్రమాణాలు మారడం కూడా సంక్షోభానికి దారి తీశాయి. ప్రస్తుతం భారత్ 5 ఉద్గార ప్రమాణాలు అనుసరిస్తూ ఉంటే 2020 నుంచి భారత్ 6 ఉద్గార ప్రమాణాలు అనుసరించవలసి ఉంది. కొత్త ప్రమాణాలకు కట్టుబడాలంటే సాంకేతికతా మారాల్సిందే. ఇది ముఖ్యంగా డీజిల్ కార్లకు వర్తిస్తుంది. డీజిల్ కార్ల ధరలు పెరగనున్నాయి కనక పెట్రోల్ కార్లకు, డీజిల్ కార్లకు మధ్య వ్యత్యాసం రూ. 2.5 లక్షల కన్నా ఎక్కువ ఉండే వీలు లేదు. అయితే చిన్న కార్ల ధరలలో 50 శాతం వ్యత్యాసం ఉండొచ్చు.

ప్రస్తుతం డీజిల్ కార్ల అమ్మకం మొత్తం అమ్మకాల్లో 40 శాతం ఉంటే అది 28 శాతానికి పడిపోయే సూచన ఉంది. ఒకప్పుడు మొత్తం కార్ల అమ్మకాల్లో 60 శాతం ఉంటే డీజిల్ కార్ల అమ్మకం తగ్గడం 2012- 13 నుంచే మొదలైంది. 2012 -13లో లీటర్ డీసెల్ ధరకు, పెట్రోల్ ధరకు మధ్య తేడా రూ. 40 ఉంటే 2017లో అది రూ. 17కు తగ్గింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో పాటు అగ్ర భాగాన ఉన్న ఎనిమిది కార్ల ఉత్పత్తిదార్ల లాభాలు ఒక శాతం కన్న తక్కువే తగ్గి అవి 2018లో 34 శాతానికి తగ్గిపోయాయి. ఇది కార్ల తయారీదార్లను నిరుత్సాహ పరిచేదే. వాహనాల విడి భాగాలు తయారు చేసే వారు తక్కువ లాభానికే ఉత్పత్తి చేస్తుంటారు.

ఈ ప్రతికూల అంశాలన్నీ ఉపాధి అవకాశాలను దెబ్బ తీస్తున్నాయి. ముఖ్యంగా కాంట్రాక్టు ఉద్యోగాలు, రోజు కూలీలుగా పని చేసే వారి ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. వాహనాలు తయారు చేసే వారు, విడి భాగాలు తయారు చేసే వారు, డీలర్లు కలిసి గత మూడు నెలల కాలంలో 3,50,000 మందిని ఉద్యోగాల్లోంచి తొలగించారు. నిజానికి 2012 నుంచే కొత్త ఉపాధి అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. రోబోలను ఉపయోగించడమూ పెరుగుతోంది. పది వేల మంది చేసే పనిని 79 రోబోలు చేయగలుగుతున్నాయి. రోబోల వాడకం ఇతర వస్తూత్పత్తి రంగంలో కన్నా కార్ల తయారీలోనే ఎక్కువ.

తాత్కాలిక ప్రాతిపదికన, రోజు కూలీలుగా పని చేసే వారి అవకాశాలు మందగించడంతో పాటు సాంకేతిక మార్పులు, నైపుణ్యాన్ని పెంచడం, ఉన్న సిబ్బందిని సర్దడం వల్ల కూడా కొత్త ఉద్యోగాలకు అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కార్ల తయారీ వ్యాపారం కనీస విఘాతం కలిగించేట్టు వ్యవహరించాలి. అంటే వినూత్న పద్ధతులు అనుసరించాలి. ఎలెక్ట్రిక్ వాహనాలు పెంచాలన్న ఆలోచన ఉంది కాబట్టి ఈ మార్పు తప్పనిసరి. మరో సమస్య పరిస్థితులకు అనుగుణంగా నైపు ణ్యం పెంచుకోవడం. లేదా ఉద్యోగాలు కోల్పోయిన వారికి కొత్త సంపాదనా మార్గాలైనా చూపాలి.

SIAM report 26 percent decline in domestic car sales in May