Friday, March 29, 2024

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి స్వచ్ఛంద విరమణ

- Advertisement -
- Advertisement -

Siddipet Collector Venkatram Reddy retired voluntarily

వెంటనే ఆమోదించిన సిఎస్
టిఆర్‌ఎస్‌లో చేరే అవకాశం!

మనతెలంగాణ/హైదరాబాద్: సిద్దిపేట జిల్లా కలె క్టర్ వెంకట్రామిరెడ్డి ఐఎఎస్ పదవికి రాజీనామా చే శారు. ఐఎఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (విఆర్‌ఎస్) కోరుతూ సిఎస్ సోమేశ్ కు మార్‌కు సోమవారం రాజీనామా లేఖ అందించా రు. వెంటనే వెంకట్రామిరెడ్డి విఆర్‌ఎస్‌ను ఆమోది స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే వెంకట్రామిరెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉన్న ట్లుగా తెలుస్తోంది. వెంకట్రామిరెడ్డికి గవర్నర్ కోటా లో టిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌సి పదవి ఇచ్చే అవకా శం ఉన్నట్లుగా సమాచారం.

సిఎం కెసిఆర్ మార్గనిర్దేశం ప్రకారం..

రాజీనామా ఆమోదం అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామాను ప్రభు త్వం ఆమోదించిందని, 26ఏళ్ల పాటు వివిధ ప్రభు త్వాల్లో పనిచేసినట్లు పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ ప్రభుత్వం ప్రజల కోసం కృషి చేస్తోందన్నారు. దే శం మొత్తం తెలంగాణ వైపు చూసేలా సిఎం కెసి ఆర్ తెలంగాణను తీర్చిదిద్దుతున్నారన్నారు. ఈ అభి వృద్ధి మార్గంలో సిఎంతో ఉండాలనుకొని విఆర్ ఎస్ తీసుకోవాలని నిర్ణయించుకున్నానన్నారు. రా నున్న వందేళ్లు తెలంగాణ గురించి ప్రజలు చెప్పు కొనే విధంగా రాష్ట్రాన్ని

సిఎం కెసిఆర్ అభివృద్ధి చేస్తున్నారని, సిఎం కెసిఆర్ నుంచి పిలుపు వచ్చాకే టిఆర్‌ఎస్ పార్టీలో చేరతానని, సిఎం కెసిఆర్ మార్గనిర్ధేశం ప్రకారం పని చేస్తానని ఆయన పేర్కొన్నారు.

ఎన్నో కొత్త ప్రాజెక్ట్‌లకు సిద్దిపేట జిల్లా వేదిక అయ్యింది

రాష్ట్రాన్ని అణువణువు అర్ధం చేసుకున్న వ్యక్తి సిఎం కెసిఆర్‌నని, ఏదైనా ఒక కార్యక్రమం, ప్రాజెక్ట్ చేపట్టాలంటే కెసిఆర్ అపార అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని ఆయన తెలిపారు. సిద్దిపేటలో జరిగిన ప్రతి కార్యక్రమాన్ని ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్లాలన్నది సిఎం కెసిఆర్ విజన్‌తో తాము నడుచుకున్నామన్నారు. సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్ రావు ఆలోచనలకు అనుగుణంగా సిద్దిపేటను అభివృద్ధిలో దేశంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానన్నారు. ఎన్నో కొత్త ప్రాజెక్ట్‌లకు సిద్దిపేట జిల్లా వేదిక అయ్యిందన్నారు. సిఎం కెసిఆర్ ఆలోచన విధానంతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూశానని, తెలంగాణ అంతకంటే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని, అందులో తాను కూడా భాగస్వామ్యున్ని కావడం ఆనందంగా ఉందన్నారు. భూసేకరణ విషయంలో 9వేల కుటుంబాలకు ఇబ్బంది లేకుండా భూసేకరణ చేశామన్నారు.

ఈ 7 సంవత్సరాలు తనకు సంతృప్తి ఇచ్చింది

ముంపు గ్రామాల వాసులు ఖాళీ చేసే సమయంలో ఎవరికి ఇబ్బంది లేకుండా చేశామని, సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావు ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ జిల్లాలో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టామన్నారు. తన 26 సంవత్సరాల సర్వీస్‌లో ఈ 7 సంవత్సరాలు తనకు సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఈ 7 సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాల్లో తనను కూడా సిఎం కెసిఆర్ భాగస్వామ్యం చేశారన్నారు. సిఎం కెసిఆర్ చేస్తున్న అనేక కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. సిఎం కెసిఆర్ ఏ పదవి ఇచ్చిన నా వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

వెంకట్రామిరెడ్డి ప్రస్థానం

వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా ఓదెలలోని ఇందుర్తి. 1991లో గ్రూప్-1 అధికారిగా ప్రభుత్వ సర్వీసుల్లో వెంకట్రామిరెడ్డి చేరారు. బందర్, చిత్తూరు, తిరుపతిలో ఆయన ఆర్డీఓగా పనిచేశారు. మెదక్‌లో డ్వామా పిడిగాను, హుడా సెక్రటరీ, జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్‌గా కూడా పని చేశారు. సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. ఏడేళ్లు జేసీగా, కలెక్టర్‌గా పనిచేశారు. వచ్చే సంవత్సరం సెప్టెంబర్‌లో ఐఏఎస్‌గా వెంకట్రామిరెడ్డి పదవీ విరమణ చేయాల్సి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News