Tuesday, March 21, 2023

క్రీడలకు కేంద్రంగా సిద్దిపేట : మంత్రి హరీశ్‌రావు

- Advertisement -

harish

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట క్రీడలకు కేంద్రంగా రూపొందించడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్టు మంత్రి టి. హరీశ్‌రావు వెల్లడించారు. గురువారం సిద్దిపేట మినీ స్టేడియం ఆవరణలో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన స్విమ్మింగ్ ఫూల్‌ను ప్రారంభించి మాట్లాడారు. అన్ని హంగులతో జాతీయ స్థాయి పోటీలకు ఉప యుక్తంగా అంతర్జాతీయ ప్రమాణాలతో స్వి మ్మింగ్ ఫూల్‌ను నిర్మించుకున్నామని అన్నా రు. ఆరోగ్యం కోసం స్మిమ్మింగ్‌కు మించిన వ్యాయామం మరొకటి లేదని, దీని నిర్వ హణకు ప్రతి నెల రూ.3.5లక్షల వ్యయం అ వుతుందని, ఇక్కడ కోచ్‌తో పాటు సెక్యూరిటీ ని ఏర్పాటు చేస్తున్నామని, పట్టణ ప్రజలు దీ న్ని వినియోగించుకోవాలని కోరారు. ఆరోగ్య సిద్దిపేట ఆరోగ్య తెలంగాణలో భాగంగా స్వి మ్మింగ్ ఫూల్‌ను నిర్మించినట్టు తెలిపారు. మి నీ క్రికెట్ స్టేడియంలో ఈనెల 9వ తేది నుంచి మూడు రోజుల పాటు టిటిఎల్ పోటీలను నిర్వహించనున్నట్టు తెలిపారు. మెట్రోపాలిట న్ సిటీ హైదరాబాద్ తరువాత సిద్దిపేటలో క్రికెట్ లైవ్ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్టు వె ల్లడించారు. సిద్దిపేట శివారులో 150 ఎకరా ల్లో ఫారెస్ట్ రిక్రియేషన్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నామని, ఇక్కడ ఇంకా ఎన్నోరకాలై న అడ్వెంచర్ గేమ్స్ ఏర్పాటు చేయనున్న ట్టు తెలిపారు. మినీ స్టేడియంలో అద నంగా 4 షటిల్ కోర్టులకు రూ.8 కోట్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. స్విమ్మింగ్ ఫూల్‌లో మొదటి సభ్యత్వాన్ని మం త్రి హరీశ్‌రావు తీసుకున్నారు.
అడ్వెంచర్ పార్క్ ప్రారంభం సిద్దిపేట కోమటి చెరువు వద్ద 70 లక్షలతో నిర్మిం చిన అడ్వెంచర్ పార్క్ ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సంద ర్భంగా అడ్వెంచర్ గేమ్స్‌ను మంత్రి పరిశీలించారు. అం తకు మునుపు హైదరాబాద్ రోడ్డులోని కలెక్టర్ కార్యాల యం వద్ద రూ.38 లక్షలతో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మంత్రి హ రీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో చైర్మన్ రాజనర్సు, ఆర్డీవొ ముత్యంరెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News