Thursday, April 25, 2024

సిద్దిపేట త్వరలో సీడ్ హబ్ గా మారనుంది: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Siddipet will be seed hub

సిద్దిపేట: 4 కోట్ల ప్రజల భవిష్యత్తు, 70 లక్షల రైతుల ప్రయోజనం కోసం కేంద్ర మంత్రులను కలిసేందుకు తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్తే… పని పాటా లేదా అంటూ కేంద్ర మంత్రి హేళన చేయడం దారుణమని విషయమని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.  సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ లో తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ భవనం, సీడ్ గిడ్డoగి నిర్మాణానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు భూమిపూజ చేశారు. రూ. 8 లక్షల తో ఏర్పాటు చేసిన ఇ – నామ్ లో గ్రేడ్ అసెసింగ్ , ప్రయోగ పరీక్ష కేంద్రాన్ని హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడారు. ఎంసి చైర్మన్ పాల సాయిరాం ప్రత్యేక కృషితో మార్కెట్ కు రెండు సంవత్సరాలలోనే మంచి రూపు, పేరు వచ్చిందని కొనియాడారు.  కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసిందని, సంవత్సరం పాటు రైతుల పోరాటం చేయడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మూడు వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేసిందన్నారు.

 ఆహార భద్రత అంశం కేంద్రం పరిధిలోనిదని,  వ్యవసాయంలో లాభ నష్టాలను భేరీజు వేసుకొని నిర్ణయాలను తీసుకునేది కేంద్ర ప్రభుత్వమని,  వడ్ల కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం ద్వందనీతి  ప్రజలకు, రైతులకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ఆయిల్ ఫామ్, సెరి కల్చల్ , పప్పు దినుసులు, పల్లి వంటి డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలను రైతులు సాగు చేయాలని కోరారు. తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో సెరి కల్చల్ సాగు చేస్తున్న జిల్లా సిద్దిపేటేనని, సిద్దిపేట జిల్లాలో 2 వేల ఎకరాలలో రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారని హరీష్ రావు పొగిడారు.

విత్తనోత్పత్తి కి సిద్దిపేట జిల్లా అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని, సిద్దిపేట త్వరలోనే సీడ్ హబ్ గా మారనుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఐదు జిల్లాలో సీడ్ కార్పొరేషన్ కు కార్యాలయాలు ఉన్నాయని, సిద్దిపేట ఆరోవది అని, ఎఎంసిలోని 11 షేడ్ లకు, 8 గోదాములకు పేర్లు పెడుతున్నామన్నారు. జిల్లాలోని ముఖ్య ప్రాంతాల పేర్లను షేడ్ లకు నామకరణం చేస్తున్నామన్నారు. రైతులు, హమాలీలు, లారీ డ్రైవర్ లు సులువుగా గుర్తించేందుకు వీలుగా పేర్లు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్ సి ఫారూక్ హుస్సేన్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు నాగిరెడ్డి, ఎఎంసి చైర్మన్ పాల సాయి రాం, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News