Saturday, March 25, 2023

సిద్దిపేటనే నా కుటుంబం

- Advertisement -

harish

* మంత్రి తన్నీరు హరీశ్‌రావు

మన తెలంగాణ/సిద్దిపేట టౌన్: సిద్దిపేటనే నా కుటుంబమని, ఇక్కడి ప్రజలు సిఎం కేసీఆర్‌ను, నన్ను తమ కు టుంబ సభ్యులుగా భావిస్తున్నారని మంత్రి టీ.హరీశ్‌రా వు అన్నారు. ఆదివారం రాత్రి శివమ్స్ గార్డెన్‌లో శివాజీ నగర్ ఆర్యవైశ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని మాట్లాడారు. సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి కృషి చేస్తున్నామని, ఇందులో భా గంగా జిల్లా ఏర్పాటు, గోదావరి జలాల రాకతో పాటు త్వరలోనే రైలు కూడా వస్తుందన్నారు. సిద్దిపేటలో నిర్మిం చే వైశ్య భవన్ తెలంగాణ రాష్ట్రంలోనే మోడల్‌గా నిలవనున్నదన్నారు. సిద్దిపేటలో వైశ్యులకు కేసీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉందని, మాపై వున్న ప్రేమే మమ్మల్ని ఇం త వరకు తెచ్చిందన్నారు. అన్ని సంఘాలు సంఘటితం గా ఉన్పప్పుడు మనం  బలంగా ఉంటామన్నారు. సిద్దిపే ట అభివృద్ధిలో ఇక్కడి ప్రజల సహకారం గొప్పదని, దీం తో పెద్ద పెద్ద పనులను సునాయసంగా చేస్తున్నామన్నా రు. సిద్దిపేట ప్రాంతం ఇండస్ట్రీయల్ హబ్‌గా మారబోతోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, చైర్మన్ కె.రాజనర్సు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News