Friday, July 11, 2025

సిగాచి పరిశ్రమలో పేలుడు… 43కు చేరిన మృతులు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 43కి చేరింది. సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మరో మృతదేహాన్ని గుర్తించారు. మరో ఇద్దరి శరీర అవశేషాలను డిఎన్ఎ ద్వారా గుర్తించారు. ఆచూకీ లేని తొమ్మిది మందిలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ప్రమాదం జరిగిన సమయంలో 143 మంది కార్మికులు పని చేస్తుండగా ఇప్పటివరకు 43 మంది మృతులను గుర్తించారు. ఇంకా ఏడుగురి ఆచూకీ లభించలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News