Saturday, April 20, 2024

కేంద్రానికి స్వదేశీ సంస్థ సీరం నుంచి పోలియో వ్యాక్సిన్ల సరఫరా

- Advertisement -
- Advertisement -

SII to supply Inactivated Polio Vaccine to Centre

న్యూఢిల్లీ : ఈనెల నుంచి ప్రారంభం కానున్న సార్వత్రిక టీకా కార్యక్రమం కోసం పోలియో వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వానికి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సరఫరా చేయనున్నది. ఈ విధంగా ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ల(ఐపివి) ను సరఫరా చేసే స్వదేశీ సంస్థ సీరం అవుతుంది. ఈ పోలియో వ్యాక్సిన్ల సరఫరాకు సంబంధించి 54 లక్షల డోసుల కొనుగోలుకు ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ ఆర్డరు ఇచ్చింది. ఇంతవరకు పోలియో వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వం విదేశీ పార్మా కంపెనీ సనోఫీపై ఆధారపడుతోంది. పోలియో నుంచి పిల్లలను కాపాడగల ఈ వ్యాక్సిన్ స్వదేశీ సంస్థ నుంచి సరఫరా కావడం ఇదే మొదటిసారని, ఆ ఘనత సీరంకే దక్కిందని కేంద్ర ఆరోగ్య విభాగానికి చెందిన డైరెక్టర్ ప్రకాష్‌కుమార్ సింగ్ తెలిపారు. పోలియో వ్యాక్సిన్ల మొదటి బ్యాచ్ ఈనెల ప్రభుత్వ మెడికల్ స్టోర్స్ విభాగానికి సరఫరా అవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News