Home తాజా వార్తలు ఖతార్‌లో జరుగనున్న సైమా వేడుక…

ఖతార్‌లో జరుగనున్న సైమా వేడుక…

SIIMA

 

సైమా ఎనిమిదవ అవార్డుల వేడుక ఆగస్టు 15, 16వ తేదీలలో ఖతార్‌లో జరుగనుంది. ఈ వేడుకకు సంబంధించిన వివరాలను తెలియజేయడానికి ఏర్పాటుచేసిన సమావేశంలో సుధీర్‌బాబు, శ్రియాశరణ్, విబ్రి మీడియా ఎండి విష్ణు ఇందూరి, పాంటలూన్స్ ప్రతినిధి ర్యాన్ ఫెర్నాండెజ్, శాన్వి శ్రీవాస్తవ, అస్మిత నర్వాల్, నిధి అగర్వాల్, మాన్వితా కామత్, రుహాని శర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణు ఇందూరి మాట్లాడుతూ “ఆగస్టు 15, 16వ తేదీలలో సైమా అవార్డుల వేడుకను ఖతార్‌లోని దోహాలో నిర్వహిస్తాం.

సైమా గత ఏడాది కన్నా ఈ ఏడాది మరింత కలర్‌ఫుల్‌గా ఉంటుంది. పలువురు సినీ తారలు ఈ వేడుకలో సందడి చేయనున్నారు”అని అన్నారు. ఈ అవార్డుల వేడుకకు సంబంధించి తెలుగులో టాప్ నామినేషన్స్ అందుకున్న చిత్రాలుగా రంగస్థలం, మహానటి, గీత గోవిందం, అరవింద సమేత నిలిచాయి. అదేవిధంగా తమిళ్,మలయాళం, కన్నడ భాషల్లో పలు చిత్రాలు టాప్ నామినేషన్స్ అందుకున్నాయి. ఇక ఈ వేడుకలో భాగంగా షార్ట్ ఫిల్మ్‌కు కూడా అవార్డులను అందజేయనున్నారు. యంగ్ ఫిల్మ్‌మేకర్స్‌ను ప్రోత్సహించడానికి ఈ షార్ట్‌ఫిల్మ్‌కు అవార్డులను అందజేయనున్నట్లు విష్ణు ఇందూరి తెలియజేశారు.

SIIMA Ceremony to be held in Qatar