Home తాజా వార్తలు ‘ సిల్లీ ఫెలోస్ ’ ట్రైలర్ విడుదల

‘ సిల్లీ ఫెలోస్ ’ ట్రైలర్ విడుదల

'Silly Fellows' Trailer Released

హైదరాబాద్ : సునీల్, అల్లరి నరేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ సిల్లీ ఫెలోస్ ’ సినిమా ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఆదివారం ట్విటర్ ద్వారా విడుదల చేశారు. భీమనేని శ్రీనివాస్‌రావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర శుక్ల, పూర్ణ, జయప్రకాశ్‌రెడ్డి, రాజా రవీంద్ర, ఝాన్సీ, హేమ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ అంచనాలకు మించి ఉంది. మంచి టైమింగ్‌తో సునీల్, అల్లరి నరేష్, బ్రహ్మానందంలు చేసిన కామెడీ ఆకట్టుకునేలా ఉంది. భీమనేని , నరేష్ కాంబినేషన్‌లో 2012లో సుడిగాడు సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

‘Silly Fellows’ Trailer Released