Home దునియా సింహగిరి సింగారాలు

సింహగిరి సింగారాలు

 

రాజు తన రాజ్యరక్షణ కోసం కొండపైనే తన దర్బారును ఏర్పాటు చేసుకున్నాడు. శతాబ్దాల నాడు రాజ మందిరాలతో వైభవోపేతంగా అలరారిన ఆ చోటు ఇప్పుడు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. సింహగిరిగా పిలిచే ఈ కొండ శ్రీలంకలో ఉంది. ఐదో శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన కశ్యపుడనే రాజు విశాలమైన మైదానంలో ఉన్న ఈ కొండ మీద కోటను నిర్మించుకున్నాడు. అంతే కాదు కొండమీదకి వెళ్లే దారిలో గోడల నిండా అందమైన బొమ్మలూ వేయించాడు. ఇప్పటికీ అక్కడికి వెళితే ఆ బొమ్మలతో పాటు కొండ మీద కోట ఆనవాళ్లను చూస్తూ పచ్చని ప్రకృతి సౌందర్యాన్నీ ఆస్వాదించవచ్చు.

 

simha giri Hill Located in sri lanka