Wednesday, November 13, 2024

సింధుకు మళ్లీ నిరాశే

- Advertisement -
- Advertisement -

Sindhu loses first singles at Women's World Tour Finals

 

బ్యాంకాక్: పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న భారత స్టార్ షట్లర్ పి.వి.సింధుకు మరోసారి ఓటమి ఎదురైంది. ప్రతిష్టాత్మకమైన మహిళల వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్ తొలి సింగిల్స్‌లో సింధు పరాజయం చవిచూసింది. గ్రూప్‌బిలో భాగంగా బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సింధు ప్రపంచ నంబర్‌వన్, చైనీస్‌తైపి షట్లర్ తై జు యింగ్ చేతిలో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన పోరులో తై జు 1921, 2112, 2117తో సింధును ఓడించింది. తొలి గేమ్‌లో సింధు ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా తన మార్క్ షాట్లతో ముందుకు సాగింది. తైజు జోరుకు అడ్డుకట్ట వేస్తూ లక్షం దిశగా సాగింది. ఇదే క్రమంలో సెట్‌ను కూడా సొంతం చేసుకుంది. కానీ తర్వాత తై జు అనూహ్యంగా పుంజుకుంది. సింధుపై ఆధిపత్యం చెలాయిస్తూ ముందుకు సాగింది. చూడచక్కని షాట్లతో చెలరేగిన తైబు అలవోకగా రెండో గేమ్‌ను దక్కించుకుంది. ఇక ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో సింధు చివరి వరకు గట్టిగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన తైజు వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇక గురువారం జరిగే రెండో సింగిల్స్‌లో సింధు థాయిలాండ్ క్రీడాకారిణి ఇంతానన్ రచనోక్‌తో తలపడుతుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో సాగే ఈ టోర్నమెంట్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే క్రీడాకారిణిలు సెమీఫైనల్‌కు చేరుకుంటారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News