Saturday, April 20, 2024

సింగపూర్ సర్కార్ సంచలన నిర్ణయం

- Advertisement -
- Advertisement -

Singapore ban non-resident visitors from India

లయన్ సిటీ: ప్రపంచదేశాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే విదేశీయులపై సింగపూర్ నిషేధం విధించింది. ఇటీవల చెన్నై నుంచి సింగపూర్ వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 14 రోజుల్లో భారత్ లో ఉన్నవారికి వీసాలు ఇవ్వమని సింగపూర్ ప్రకటించింది. భారత్ నుంచి వచ్చే స్వదేశీయులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు వెల్లడించింది. దేశంలో గడిచిన 24 గంటల్లో 3.46 లక్షల మందికి కరోనా వైరస్ సోకింది. మరో 2624 మందిని కరోనా కబలించింది. కాగా, భారత్ లో ఇప్పటివరకు 13.5 కోట్ల మందికి కోవిడ్-19 టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Singapore ban non-resident visitors from India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News