Home మంచిర్యాల సౌర వెలుగుల వైపు సింగరేణి అడుగులు

సౌర వెలుగుల వైపు సింగరేణి అడుగులు

Singer feet side the solar light

బెల్లంపల్లి ఏరియాలో మూడు ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం                                                                                            100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక                                                                                                                  జైపూర్ పవర్‌ప్లాంట్‌లో 10 మెగావాట్ల కేంద్రం
సౌర వెలుగులు పంచేందుకు సింగరేణి సమాయత్తం

మనతెలంగాణ/మంచిర్యాల: బొగ్గు ఉత్పత్తితో దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి యాజమాన్యం సౌర విద్యుత్ వెలుగుల వైపు అడుగులు వేస్తోంది. సౌర విద్యుత్ వెలుగులు పంచడానికి సమాయత్తం అవుతుంది. సింగరేణిలో విద్యుత్ ఉత్పత్తి సామార్థాన్ని పెంచేందుకు సన్నాహాలు చేస్తుంది. బెల్లంపల్లి రీజియన్‌లో మూడు ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఆమోద ముద్ర వేసింది. ఈ ప్లాంట్ల ద్వారా 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని లక్షంగా పెట్టుకుంది. బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని మందమర్రి ఏరియాలో మొదట 50 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. యాజమాన్యం తాజాగా నిర్వహించిన బోర్డు సమావేశంలో మరో 10 మెగావాట్లను పెంచుతూ 60 మెగావాట్ల విద్యుత్ కేంద్రం వైపు మొగ్గు చూపింది. అదే విధంగా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 10 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం బెల్లంపల్లి 30 మెగావాట్ల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో మొత్తంగా 100 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని చేసేందుకు లక్షంగా నిర్ణయించింది. వీటితో పాటు ఇల్లందులో 60 మెగావాట్లు, మణుగూరులో 30, కొత్తగూడెంలో 25, రామగుండం-1 ఏరియాలో 50 మెగావాట్లు, రామగుండం2 ఏరియాలో 25, భూపాలపల్లిలో 10మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాలు వాటికి వెచ్చించే వ్యయంపై ప్రభుత్వ సంస్థలైనా ఎన్‌టిపిసి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా సంస్థ ప్రతినిధులతో చర్చించి సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలు ,ఖర్చు, రాబడి , తదితర అంశాలను ప్రతినిధులతో చర్చించారు. మందమర్రి,రామగుండం ఏరియాలలో తొలివిడత కింద సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు మందమర్రి ఏరియాలోని ఖాళీ స్థలాలను పరిశీలించారు. సింగరేణి పవర్ హౌజ్, వర్క్‌షాప్ ఏరియాలోని సింగరేణి స్థలాలను అధికారుల బృందం పరిశీలించింది. అదే విధంగా మరో ఏడు ఏరియాల్లో కూడా సౌర విద్యుత్ కేంద్రాలను అందుబాటులోకి  తీసుక వచ్చేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది. సింగరేణి వ్యాప్తంగా 9 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 300 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్షంగా పెట్టుకుంది. ఇందులోభాగంగా సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటులో  అనుభవం ఉన్న సౌత్ ఈస్ట్రన్ సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అనే ప్రభుత్వ సంస్థకు పనులు   అప్పగించాలని సింగరేణి బోర్డు సమావేశంలో కూడా  నిర్ణయం తీసుకున్నారు. సింరగేణిలో ప్రస్తుతం 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండగా మరో 800 మెగావాట్ల  థర్మల్ కేంద్రం  నిర్మాణానికి గతంలోనే నిర్ణయం తీసుకుంది. సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తిని చేట్టేందుకు సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు వైపు ముందుకు సాగుతుంది.