Home జాతీయ వార్తలు లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమం

లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమం

Singer Lata Mangeshkarముంబయి : ప్రముఖ బాలీవుడ్ గాయని , భారతరత్న లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆమెకు వైద్యం చేస్తున్న బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి వైద్యలు వెల్లడించారు.  ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్ఫెక్షన్ తో ఆమె బాధపడుతున్నారని ఆస్పత్రి  డాక్టర్ ప్రతీత్ సందానీ తెలిపారు. న్యమోనియాతో లత బాధపడుతున్నారని, ఎడమవైపు ఉన్న జఠరిలక పూర్తిగా విఫలమైందని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే లతను వెంటిలేటర్ పై ఉంచి వైద్యం అందిస్తున్నామని ఆయన చెప్పారు. వైద్యుల పర్యవేక్షణలో లత మరి కొన్ని రోజుల పాటు ఉండాలని ఆయన పేర్కొన్నారు. లత వయస్సును దృష్టిలో ఉంచుకుని ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదని ఆయన వెల్లడించారు. సోమవారం తెల్ల వారుజామున లత తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.

Singer Lata Mangeshkar Health Condition Is Critical