Home తాజా వార్తలు టాలీవుడ్‌లోకి షిర్లీ సెటియా

టాలీవుడ్‌లోకి షిర్లీ సెటియా

Singer Shirley Setia to make Telugu acting debut

యంగ్ హీరో నాగశౌర్య ఇటీవలే హోమ్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.4 ప్రాజెక్ట్‌ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అలా ఎలా, లవర్ చిత్రాల దర్శకుడు అనీష్ కృష్ణ తెరకెక్కించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి జరగనుంది. ఈ నేపథ్యంలో మిగతా లీడ్ యాక్టర్స్‌ని ఫైనలైజ్ చేస్తున్న మేకర్స్ తాజాగా ఈ చిత్రంలో నాగశౌర్యకి జోడీగా నటించే హీరోయిన్‌ని ప్రకటించారు. ఇందులో షిర్లీ సెటియాని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. షిర్లీ సెటియా హీరోయిన్‌గానే కాకుండా సింగర్‌గా కూడా ప్రాచుర్యం పొందింది.

సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆక్లాండ్‌కి చెందిన ఈ బ్యూటీ ఫోర్బ్ మ్యాగజైన్‌లో చోటు దక్కించుకుంది. ‘మస్కా’ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన షిర్లీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘నికమ్మ’ సినిమాలో నటిస్తోంది. ఈ క్రమంలో నాగశౌర్య సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా మల్పూరి నిర్మించనున్నారు.

Singer Shirley Setia to make Telugu acting debut