Home తాజా వార్తలు తల్లి కాబోతున్న గాయని శ్రేయా ఘోషల్

తల్లి కాబోతున్న గాయని శ్రేయా ఘోషల్

Singer Shreya Ghoshal To Be Motherహైదరాబాద్ : ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ తల్లి కాబోతున్నారు. `బేబీ శ్రేయాదిత్య కమింగ్` అంటూ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని శ్రేయ వెల్లడించారు. చిన్నారి శ్రేయాదిత్య రాబోతోందని, ఈ శుభవార్తను అభిమానులతో పంచుకోవడం ఆనందంగా ఉందని శ్రేయా పేర్కొన్నారు. తమ జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో మీ అందరి ప్రేమ, దీవెనలు కావాలని శ్రేయా అభిమానులను కోరారు. బేబీ బంప్‌తో ఉన్న తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.  హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, అస్సామీ తదితర  భారతీయ భాషల్లో శ్రేయా పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, పలు అవార్డులు, రివార్డులను సైతం సొంతం చేసుకున్నారు. తన చిరకాల స్నేహితుడు శైలాదిత్యను 2015లో శ్రేయా పెళ్లి చేసుకున్నారు.