Tuesday, April 23, 2024

వంగపండు ప్రసాదరావు ఇకలేరు

- Advertisement -
- Advertisement -

Singer Vangapandu Prasada Rao passed away

హైదరాబాద్: ప్రముఖ జానపద గాయకుడు వంగపండు ప్రసాదరావు(77)కన్నుమూశారు. పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో వంగపండు తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వందలాది జానపదపాటలకు వంగపండు ప్రసాదరావు రచించారు. ”ఏం పిల్లడో ఎల్దమొస్తవ”పాటతో వంగపండు ప్రఖ్యాతి చెందారు. ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి ఆయన పాటలు పాడారు. పల్లెకారులతో పాటు గిరిజనులనూ వంగపండు చైతన్యపరిచారు. విప్లవకవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరుపొందారు. 1943లో పెదబొండపల్లిలో వంగపండు జన్మించారు. ”అర్థరాత్రి స్వాతంత్ర్యం” సినిమాతో వంగపండు సినీ ప్రస్థానం మొదలైంది. 2017లో కళారత్న పురస్కారం అందుకున్నారు. 1972లో జననాట్యమండలిని ఆయన స్థాపించారు. మూడు దశాబ్దాల్లో 300పైగా పాటలు రచించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, నాయకులు సంతాపం తెలిపి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Singer Vangapandu Prasada Rao passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News