Home తాజా వార్తలు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయండి

లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయండి

 inland villages

 

ప్రజలు భయాందోళనకు గురికావద్దు,  ముంపు గ్రామాల్లో పర్యటించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

పెబ్బేరు : ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానది ప్రవాహం తీవ్ర స్థాయిలో కొనసాగుతుండడంతో ముంపు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. పెబ్బేరు మండల పరిధిలోని రంగాపూర్, మునగమాన్‌దిన్నె, పెంచికల పాడు, ఈర్లదిన్నె గ్రామాలను ఆదివారం సందర్శించారు. రంగాపూర్ పుష్కర ఘాట్ పూర్తి స్థాయిలో నిండిపోయి ఆంజనేయస్వామి ఆలయం వరకు నదీప్రవాహం రావడంతో ప్రమాదఘంటికలు మొదలైనట్లు ఆయన తెలిపారు.

2009 సంవత్సరంలో వరద భీభత్సాన్ని ఈ ప్రాంత ప్రజలు చూశారని అయితే అప్పట్లో వర్షాలు ఇక్కడ కూడా భారీగా కురవడంతో ముంపు గ్రామాలన్నీ జలమయం అయ్యా యని గుర్తు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండడంతో నారాయణపూర్ ప్రాజెక్టు డ్యాం ద్వారా నీటిని భారీగా విడుదల చేయడంతో జూరాల పూర్తి స్థాయిలో 63 గేట్లు ఎత్తివే యడంతో వరద తాకిడి పెరిగిందన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌తో లోతట్టుఉన్న ప్రాంతాలకు నీరు వస్తుం దన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు.

ముంపు గ్రామాల ప్రజలు భయాం దోళనకు గురికావద్దన్నారు. సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిపై సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానంగా ఆయా గ్రామాల్లో ఇటీవల రైతులు నాట్లు వేశారనిఆ పొలాలన్నీ నీటి మయం అయ్యాయని రైతులు మంత్రితో వాపొయ్యారు. మంత్రి వెంట జడ్పిచైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, ఆర్డీఒ చంద్రారెడ్డి, జడ్పిటిసి పద్మ వెంకటేష్, మార్కెట్ కమిటి మాజి చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, మాజి జడ్పిటిసి కర్రెస్వామి, సర్పంచ్‌లు గోవింద్‌నాయుడు, రాజవర్ధన్‌రెడ్డి, మాజి ఎంపి టిసి కట్టా శ్రీనివాస్‌రెడ్డి, డిటి అశోక్‌కుమార్, ఉండవల్లి ఎంపిపి నీలంగౌడ్ ,మాజి కోఆప్షన్ సభ్యులు ముస్తాక్, టిఆర్‌ఎస్ నాయకులు ఎల్లారెడ్డి, గంధం వెంకటయ్య, జహీర్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Singireddy Niranjan Reddy who toured inland villages