Home తాజా వార్తలు ప్లాస్టిక్‌పై కమిటీ

ప్లాస్టిక్‌పై కమిటీ

plastic-ban

వాడి పారేసే ప్లాస్టిక్ సామగ్రి నిషేధంపై అధికారుల సంఘం ఏర్పాటు

మన తెలంగాణ/హైదరాబాద్ : పర్యావరణానికి తీవ్ర ముప్పుగా వాటిల్లిన సింగిల్‌యూస్ ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందిగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిషేధం అమలు కోసం అధ్యయనం కోసం ప్రత్యేకంగా ఒక అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని చైర్‌పర్సన్‌గా, ముగ్గురు ముఖ్య కార్యదర్శులు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ సభ్యులుగా, రాష్ట్ర పొల్యూషన్ బోర్డు సెక్రటరీ మెంబర్ కన్వీనర్‌గా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సింగల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయీలో ఏ విధంగా నిషేధించాలన్న అంశంపై అధ్యయనం చేస్తుంది.

ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పిస్తుంది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని సింగల్ యూజ్ ప్లాస్టిక్‌ను ప్రభుత్వం నిషేధించనుంది. ఇప్పటికే 50 మెక్రాన్ల తక్కువ మందంగల ప్లాస్టిక్ కవర్ల వాడకంపై జిహెచ్‌ఎంసి అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. తక్కువ మందం గల కవర్లను విక్రయించే అధికారులపై పెద్దఎత్తున అపరాద రుసుంను విధిస్తున్నారు. ఇది నిత్యం ఒక స్పెషల్ డ్రైవ్‌గా అధికారులు కొనసాగిస్తున్నారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ప్రస్తుతం ప్రజల దైనందిన జీవనంలో ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది.

దీని వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ క్యారీబ్యాగులు, ఇతర సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణానికి స్వల్పకాలిక, దీర్ధాకలికంగా హాని కలిగిస్తోంది. అలాగే ప్రజలు, జంతువుల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48ఎ, ప్రకారం పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ జెండాలు, ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ స్పూన్లు, కాంగ్ ఫిల్మ్‌లు (ప్లాస్టిక్ కవరింగ్), డైనింగ్ నింగ్ వినియోగిస్తున్న ప్లాస్టిక్ షీట్లు, థర్మాకోల్‌తో తయారైన వస్తువులు తీవ్రమైన పర్యావరణ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మానవుల, జంతువుల ఆరోగ్యంపై ప్రభావితం చూపుతున్నాయి.

అలాగే ప్లాస్టిక్ వ్యర్ధాలు మురుగు కాలువలు, కాలువలను అడ్డుకోవడానికి కారణమవుతున్నాయి. వీటి ద్వారా రాష్ట్రంలో నీటి వనరులు సైతం కలుషితమవుతున్నాయి. అందువల్ల సమస్యను అధ్యయనం చేయడానికి, ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై ప్రత్యామ్నాయంగా సింగల్ యూజ్ వాడకం ఉత్పత్తులను ఉత్పత్తి చేయాడానికి అవసరమైన పరిశ్రమలను ప్రొత్సహించడానికి అధ్యయాన కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి తగు సూచనలు, సలహాలను ఇవ్వనుంది. ఇందుకుగానూ అధ్యయాన కమిటీ అధికారులు వివిధ రాష్ట్రాల్లో ప్లాస్టిక్ వాడకం, నిషేథంపై దాని ప్రభావం, ప్లాస్టిక్ వస్తువుల యొక్క ఒకే వాడకానికి ప్రత్యమన్యాలపై అధ్యాయం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిచాలి. ప్లాస్టిక్‌కు ప్రత్యామన్యా ఉత్పత్తులను ఉత్పత్తి చేయానికి అటువంటి పరిక్షమలు ప్రొత్సహించడానికి, అటువంటి పరిశ్రమలకు ప్రొత్సహకాలను అవసరమైన సూచనలను అందించనుంది.

Single use Plastic Ban in Telangana