Saturday, April 20, 2024

సిరివెన్నెల సీతారామ శాస్త్రీ ఆరోగ్య పరిస్థితి విషమం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొన్ని రోజులుగా సిరివెన్నెల న్యూమోనియాతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన కుటుంబ సభ్యులను ఆస్పత్రికి పిలిపించి.. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు రావడంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకొని, క్షేమంగా ఇంటికి తిరిగిరావాలని ప్రార్థిస్తున్నారు.

Sirivennela Seetharama Sastry admitted in KIMS Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News