Home తాజా వార్తలు సందర్శకులతో నిండిపోయిన సిర్నాపల్లి వాటర్‌ఫాల్స్

సందర్శకులతో నిండిపోయిన సిర్నాపల్లి వాటర్‌ఫాల్స్

Sirnapalli waterfalls

 

నిజామాబాద్ : జిల్లా కేంద్రంతో పాటు ఇతర జిల్లాలకు చెందిన పలువురు ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి గ్రామంలోని శీలం జానకిబాయి నిర్మించిన పురాతన కట్టడాన్ని తిలకించేందుకు వేలాదిమంది తరలిరావడంతో సిర్నాపల్లి చెరువు దగ్గర పండగ వాతావరణం నెలకొంది. రెండవ శనివారం కావడంతో సిర్నాపల్లి వాటర్‌ఫాల్స్ దగ్గర సందర్శకులతో కిటకిటలాడుతున్న అడవి అందాలు కనిపిస్తున్నాయి. 40 అడుగులు ఎత్తు నుంచి నీరు జారిపడడంతో సందర్శకులు స్నానాలు చేయడానికి పోటీ పడుతున్నారు. దీంతో అక్కడ సందర్శకుల తాకిడికి ప్రకృతి అందాలు కనివిందు చేస్తున్నాయి.

గత 15యేళ్లుగా ఇంత పెద్ద ఎత్తున వర్షాలు కురిసిన దాఖలాలు లేవని ఈ సారి భారీ ఎత్తున కురిసిన వర్షాలకు చెరువు నిండిపోవడంతో పాటు ఆలుగు పారుతుండటం వల్ల సందర్శకుల తాకిడి ఎక్కువైందని సిర్నాపల్లి ఎంపిటిసి అశ్విని శ్రీనివాస్ తెలిపారు. సిర్నాపల్లి అలుగును పర్యాటక ప్రాంతం చేసి అక్కడ అభివృద్ది చేయాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు విజ్ఞప్తి చేయడం జరిగిందని ఆమె తెలిపారు. శీలం జానకి బాయి నిర్మించిన చెరువు అలుగు వరకు తారు రోడ్డు లేక సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయాలని ఆమె కోరుతున్నారు.

Sirnapalli waterfalls crowded with visitors