Saturday, April 20, 2024

అన్న కొట్టాడని చెల్లెలు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

suicide

 

కొత్తగూడెం/పాల్వంచ టౌన్ : భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణంలో సొంత అన్న చెల్లెలిపై అత్యాచారం చేశాడని వచ్చిన ఆరోపణలు నిజం కాదని తేలిపోయింది. అన్న కొట్టడంతో చెల్లెలు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించి పాల్వంచ పట్టణ ఎస్ ఐ ప్రవీణ్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణ పరిధిలోని జ్యోతి నగర్‌లో చప్పిడి వెంకట్, రాధమ్మ దంపతుల కుమార్తె చప్పిడి భూమిక కలసి ఉంటున్నారు. వారి కుమారుడు రాంబాబు తన భార్యతో కొద్ది దూరంలోని మరో ఇంటిలో నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి వెంకట్ తన భార్యతో కలిసి భూపాలపల్లిలోని ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళుతూ తమ కుమార్తె భూమికను తమ కుమారుడు రాంబాబు వద్ద ఉంచి వెళ్లారు. అయితే భూమిక గురువారం తమ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లింది. అయితే ఎంతసేపటికి తిరిగి రాకపోవటంతో రాంబాబు భార్య స్వాతి ఈ విషయం భర్తకు చెప్పి భూమికను భోజనానికి తీసుకురావాలని కోరింది.

బైక్ పై తను భూమిక కోసం తమ తండ్రి ఇంటికి వెళ్లిన రాంబాబు భూమికను విపరీతంగా కొట్టాడు. తను మేనత్త కుమారుడి సంబంధం తెస్తే, అది కాదని వేరే సంబంధం ఎందుకు ఒప్పుకున్నావంటూ కొట్టాడు. అప్పటికే రాంబాబు మద్యం మత్తులో ఉన్నాడు. దెబ్బలు భరించలేక భూమిక గుళికలు మింగి ఆత్మహత్యయత్నం చేసింది. తన భర్త, ఆడబిడ్ద రాలేదని రాంబాబు భార్య స్వాతి తమకు పరిచయస్తుడైన వాసు అనే ఆటో డ్రైవర్ కు చెప్పటంతో అతను వెంకట్ ఇంటికి వెళ్లి పరిస్థితి గమనించారు. అప్పటికి రాంబాబు తన చెల్లెను కొడుతూనే ఉన్నాడు. దీనితో వెంటనే వారిని విడిపించి, భూమిక గుళికలు మింగిన విషయం తెలుసుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

శుక్రవారం భూమిక ఆస్పత్రిలో మృతిచెందింది. వచ్చిన ఆరోపణలపై ప్రాధమిక విచారణ జరిపిన పోలీసులు ఆమె అత్యాచారానికి గురి కాలేదని తేల్చారు. వైద్యులు సైతం ప్రాథమికంగా ఇదే నిర్ధారించారని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లి తండ్రులకు అప్పగించారు. కాగా తన చెల్లెల్ని కొట్టి ఆమె ఆమే ఆత్మహత్యకు పాల్పడే విధంగా పురిగొల్పినందుకు రాంబాబుపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

sister commit suicide with her brother hitting
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News