Home తాజా వార్తలు పిడుగు పడి వదిన, మరదల మృతి

పిడుగు పడి వదిన, మరదల మృతి

Lighteningమన తెలంగాణ/ నాగర్ కర్నూల్: పిడుగు పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయ పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామానికి చెందిన చిన్న గొల్ల బాలయ్య (56) శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో తన పొలంలో ఉన్న లక్ష్మమ్మ దేవతకు నైవేద్యం పెట్టేందుకు భార్య చిన్నగొల్ల ఈశ్వరమ్మ (48) కూతురు నందిని (9) అక్క బక్కమ్మతో కల్సి పొలానికి వెళ్లారు. ఈ క్రమంలో పిడుగు పడటంతో ఈశ్వరమ్మ, బక్కమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. బాలయ్య, కూతురు గాయాల పాలయ్యారు. బక్కమ్మ తూడుకుర్తి నుంచి తమ్ముడు బాలయ్యకు రాకీ కట్టేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయింది. సంఘటన స్థలాన్ని తహ సీల్దార్ రాంరెడ్డి, సిఐ రాంబాబు,ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌లు సందర్శించి పంచనామా నిర్వహించారు.