Home తాజా వార్తలు కమనీయంగా భద్రాద్రి రామయ్య నిత్య కల్యాణం

కమనీయంగా భద్రాద్రి రామయ్య నిత్య కల్యాణం

మన తెలంగాణ/భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలంయలో శనివారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి నిత్య కల్యాణం భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభంవంగా నిర్వహించారు. ముందుగా ఆలయం తలుపులు తెరచి మేళతాళాలతో, వేదమంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు తీర్ధ బిందెను ఆలయానికి తీసుకుని వచ్చి, గర్భ గుడిలో సుప్రభాత సేవ చేసారు. శనివారం సందర్భంగా స్వామివారికి సువర్ణ తులసీదళాలతో అభిషేకం నిర్వహించారు. బాలభోగం స్వామివారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తులను ఊరేగింపుగా బేలా మండపానికి తీసుకువెళ్ళి స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన జరిపి కల్యాణ క్రతువు ప్రారంభించారు. భక్తులకు గోత్రనామాలతో కంకణాలు కట్టి స్వామివారి కల్యాణం జరిపించారు. మద్యాహ్నం రాజభోగం నిర్వహించి ఆలయం తలుపులు మూసివేసారు. సాయత్రం దర్భారు సేవ నిర్వహించారు.
గోశాల నిర్మాణానికి రూ. లక్ష విరాళం..
భద్రాచలం దేవస్థానం గోశాల నిర్మాణానికి డి కొండరాజు, డి.శివకుమారి జ్ఞాపకార్ధ వారి కుటుంబ సభ్యులు రూ 1,01,116 లు విరాళంగా అందించారు. అలాగే దేవస్థానంలో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎన్ మురళీమోహన్‌రావు, సాయిలీలా దంపతులు రూ. 51,000 విరాళంగా ఇవ్వగా, విశాఖపట్నంకు చెందిన బి రామ్‌కుమార్ రూ 50,000 వేలు వితరణ ఇచ్చారు. దాతలకు దేవస్థానం సిబ్బంది శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు.

 

Sita Rama Nithya Kalyana utsavam in Bhadradri