Home తాజా వార్తలు హాలీవుడ్ మూవీకి సితార డబ్బింగ్

హాలీవుడ్ మూవీకి సితార డబ్బింగ్

Sitara

 

సూపర్‌స్టార్ మహేష్‌బాబు గారాల పట్టి సితార డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారనుంది. ఏడేళ్ల ఈ చిన్నారి ఏకంగా హాలీవుడ్ మూవీకి డబ్బింగ్ చెప్పే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రపంచ ప్రఖ్యాత నిర్మాత సంస్థ వాల్ట్ డిస్నీ నిర్మించిన ‘ఫ్రోజెన్ 2’ చిత్రంలోని బేబీ ఎల్సా పాత్రకు తెలుగులో సితార డబ్బింగ్ చెప్పనుంది. దీంతో తమ సూపర్‌స్టార్ మహేష్ కుమార్తె చిట్టి సితార వాయిస్ తెరపై విని ఆనందించాలని ఆయన అభిమానులు ఆశగా ఎదురు చేస్తున్నారు.

సితారతో ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పించి ‘ఫ్రోజెన్ 2’ తెలుగు హక్కులు సొంతం చేసుకున్న నిర్మాతలు మంచి ప్రచారం పొందారు. సితార సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన క్యూట్ ఫొటోస్, లవ్‌లీ వీడియోస్ షేర్ చేస్తూ మహేష్ అభిమానులను ఫిదా చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది వినాయక చవితి సంధర్భంగా మట్టి వినాయకుడిని పూజించాలని దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురితో కలిసి ఆమె ఓ ప్రత్యేక వీడియో చేసింది. ఇక ‘ఫ్రోజెన్ 2’ మూవీ ఈనెల 22న విడుదల కానుంది.

Sitara dubbing for Hollywood movie