Home జాతీయ వార్తలు శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో సీతారాం ఏచూరి నిర్బంధం

శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో సీతారాం ఏచూరి నిర్బంధం

Sitaram-Yechury

 

శ్రీనగర్: సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజాలను పోలీసులు శ్రీనగర్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. పార్టీ నాయకులను కలుసుకోవడానికి తనకు అనుమతి ఇవ్వాలంటూ గురువారం జమ్మూ కశ్మీరు గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు లేఖ రాసిన సీతారాం ఏచూరి శుక్రవారం ఉదయం శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకోగానే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నగరంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇలా ఉండగా శుక్రవారం ప్రార్థనలు చేసుకునేందుకు కశ్మీరులో కర్ఫూ నిబంధనలు పోలీసులు సడలించారు. అయితే ప్రజలు తమ పరిసరాలలోనే ప్రార్థనలు చేసుకోవాలని, ప్రాంతం విడిచి బయటకు రాకూడదని డిజిపి దిల్‌బాగ్ సింగ్ ఆదేశించారు. గత సోమవారం నుంచి జమ్మూ కశ్మీరులో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి.

 

Sitaram Yechury, D Raja Detained at Srinagar airport