Home తాజా వార్తలు బాహుబలి-2 పైరసీ కేసులో ఆరుగురు అరెస్టు

బాహుబలి-2 పైరసీ కేసులో ఆరుగురు అరెస్టు

Bahubali-2

హైదరాబాద్ : బాహుబలి -2 పైరసీ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితులు ప్రధాన సర్వర్‌ను హ్యాక్ చేసి బాహుబలి-2 చిత్రాన్ని డౌన్‌లోడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు ఢిల్లీకి చెందిన రాహుల్‌మెహతాతో పాటు బిహార్‌కు చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ చిత్రాన్ని పైరసీ చేసిన అనంతరం రాహుల్‌మెహతా నేరుగా హైదరాబాద్‌లోని సినిమా ప్రొడక్షన్ కార్యాలయానికి వచ్చి రెండు కోట్లు ఇవ్వకపోతే సినిమాను ఆన్‌లైన్‌లో పెడతామని నిర్మాతను హెచ్చరించాడు. దీంతో ఈ చిత్రం నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు విచారించి మంగళవారం నిందితులను అరెస్టు చేశారు. ఈ నిందితులు గతంలో పలు బాలీవుడ్ చిత్రాలను పైరసీ చేసినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.