Home తాజా వార్తలు మూసీలో చిక్కుకున్న భక్తులు సురక్షితం

మూసీలో చిక్కుకున్న భక్తులు సురక్షితం

Moosi-River

యాదాద్రి : వలిగొండ మండలంలోని సంగం వద్ద భీమేశ్వర ఆలయాన్ని మూసీ వరదనీటి ఉదృతి పెరిగిపోవడంతో చిక్కుకుపోయిన భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. మూసీ వరద నీరు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో భీమేశ్వర ఆలయం చుట్టూ నీరు చేరింది. దీంతో భక్తులు ఆలయం పైకి చేరి హాహాకారాలు చేశారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు, స్థానికులు రంగంలోకి దిగారు. మూసీ వరద నీటిలో చిక్కుకున్న ఆరుగురు భక్తులను మత్సకారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పడవల సహాయంతో ఆలయం వద్దకు వెళ్లిన మత్సకారులు, స్థానికులు ఆలయ పూజారితో పాటు భక్తులు సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.