Home జాతీయ వార్తలు మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

Six Died In Road Accident At Madhya Pradeshభోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. ఈ ఘటన ముంబయి- ఆగ్రా జాతీయ రహదారిపై జరిగింది.  లావాడియా పోలీస్ స్టేషన్‌ పరిధిలోని తలవాలిచందా వద్ద పెట్రోల్ పంప్ ముందు ఆగి ఉన్న  ట్యాంకర్‌ను దేవాస్ నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ఘటనాస్థలిలోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఇద్దరు చనిపోయారు. మిగిలిన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. మృతులందరూ విద్యార్థులని, ప్రమాదం జరిగిన సమయంలో వీరు మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను  మహారాజా యశ్వంతరావు (ఎంవై) ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.