Home కరీంనగర్ ఆర్‌టిసి బస్సు-లారీ ఢీ: ఆరుగురి మృతి

ఆర్‌టిసి బస్సు-లారీ ఢీ: ఆరుగురి మృతి

BUS-ACCIDENT

మానకోండూరు: కరీంనగర్ జిల్లా మానకోండూరు మండలం చెంజర్ల వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ- ఆర్‌టిసి బస్సు ఢీకొని ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడినట్టు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై ఉన్న రెండు వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.