Home తాజా వార్తలు బాలుడిని మింగేసిన ఇడ్లీ

బాలుడిని మింగేసిన ఇడ్లీ

idlyమన తెలంగాణ/ఆత్మకూర్: గొంతులో ఇడ్లీ అడ్డంపడి బాలుడు మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండలం అమరచింత గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక శివాజీనగర్‌కు చెందిన పద్మ, వెంకటేష్ దంపతులకు ఆరు నెలల బాలుడు నందకిషోర్ ఉన్నాడు. బాలుడి కోసం ఉదయం తెచ్చిన ఇడ్లీని రాత్రికి తినిపించడంతో బాలుడి గొంతులో ఇరుక్కుని ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా బాలుడు మృతిచెందాడు. పద్మ, వెంకటేష్ దంపతులకు మొదటి సంతానం తర్వాత పన్నెండేళ్ళకు నందకిషోర్ జన్మించాడు.