Home తాజా వార్తలు హత్య కేసులో ఆరుగురి అరెస్టు

హత్య కేసులో ఆరుగురి అరెస్టు

Six Suspects Arrested In Murder Case At Hanamkondaహన్మకొండ : హన్మకొండలో జరిగిన ముగ్గురి హత్య కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు సిపి తరుణ్ జోషి గురువారం మీడియాకు తెలిపారు. ఆరుగురు నిందితులు మహమ్మద్ షఫీ, బోయిని వెంకన్న, ఎండీ సాజిద్, రాగులు విజేందర్, ఎండీ మీర్జా అక్బర్, ఎండీ పాషాలను అరెస్టు చేసినట్లు సిపి వెల్లడించారు.  చాంద్ పాషా, అతడి తమ్ముడు షఫీల మధ్య ఆస్తి వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో షఫీ  చంద్ పాషాతో పాటు మరో ఇద్దరిని తన స్నేహితుల సాయంతో హత్య చేశాడు. అరెస్టు అయిన నిందితుల నుంచి వేట కత్తులు, కోత మిషన్, రెండు ఆటోలు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నామని సిపి వెల్లడించారు.