Home జాతీయ వార్తలు గూడ్స్ రైలు ఢీ : ఆరుగురు మహిళలు మృతి

గూడ్స్ రైలు ఢీ : ఆరుగురు మహిళలు మృతి

Six Women Killed in Train Accident at Chhattisgarh

ఛత్తీస్‌గఢ్ : దంతెవాడ జిల్లా శంఖిణి డంఖిణి వద్ద ఆదివారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు ఢీకొని ఆరుగురు మహిళలు మృతి చెందారు. శంఖిణి డంఖిణి నదిపై ఉన్న రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళుతున్న ఆరుగురు మహిళలను గూడ్స్ రైలు ఢీకొనడంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు కుపేర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.

Six Women Killed in Train Accident at Chhattisgarh