Home తాజా వార్తలు జనప్రియ అపార్టమెంట్ లో విషాదం… బాలుడు మృతి

జనప్రియ అపార్టమెంట్ లో విషాదం… బాలుడు మృతి

Six years old Boy died

 

హైదరాబాద్: రాజేంద్రనగర్ లోని జనప్రియ అపార్టమెంట్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. పార్కులో ఆడుకుంటుండగా బిశాన్ శర్మ(6) అనే బాలుడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్లితే… పార్కులో సిమెంట్ బెంచ్ మీద కూర్చొని ఆడుకుంటుండగా బెంచ్ విరిగి బాలుడి తలపై పడింది. దీంతో బాలుడి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికకక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికు చేరుకొన్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. విరిగిన కుర్చి ఉంచడంతోనే ప్రమాదం జరిగిందని బాలుడి తల్లదండ్రులు ఆరోపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

 

Six years old Boy died in park at Rajendra nagar