Saturday, April 20, 2024

రాష్ట్రానికి చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి 6వ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ వచ్చింది. ఓడిస్సా నుంచి 6 ట్యాంకర్లలో 120 టన్నుల లిక్సిడ్ మెడికల్ ఆక్సిజన్‌ను హైదరాబాద్‌కు తెచ్చినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. ఈ ట్యాంకర్లను సనత్‌నగర్ స్టేషన్ నుంచి గాంధీ, టిమ్స్‌తో పాటు వివిధ హాస్పిటళ్లకు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ వినియోగం పెరిగింది. దీంతో కేంద్రం ఒడిస్సా, తమిళనాడు, ఏపి రాష్ట్రాల ప్లాంట్స్ నుంచి ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రతి రోజూ కేంద్రం కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్‌ను తీసుకువస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి రోజూ సుమారు 450 నుంచి 550 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగం అవుతున్నట్లు ఓ అధికారి తెలిపారు.

Sixth Oxygen Express arrives from Odisha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News