Home తాజా వార్తలు 33 జిల్లాల్లో రుణ మేళా

33 జిల్లాల్లో రుణ మేళా

SBI has announced will be running SLBC credit outreach

ఈ నెల 20 నుంచి 29 వరకు కార్యక్రమం
ఎస్‌ఎల్‌బిసి తెలంగాణ ప్రకటన

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా ఎస్‌ఎల్‌బిసి క్రెడిట్ అవుట్‌రీచ్ (రుణ మేళా) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 20 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో నిర్వహించనున్నట్టు ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. ఈ కార్యక్రమం అక్టోబర్ 29న ముగుస్తుంది. జిల్లాల్లోని ప్రభుత్వరంగ, ప్రైవేటురంగ, ఆర్‌ఆర్‌బిల సహకారంతో సంబంధిత జిల్లా మేనేజర్లు ఈ కార్యక్రమం నిర్వహించనుండగా, దీనిలో నాబార్డ్, యుఐడిఎఐ, ఇతర ప్రభుత్వ శాఖలు కూడా పాల్గొంటాయి. వివిధ రుణ సౌకర్యాలు, పథకాలపై అవగాహన కల్పించే లక్షంలో భాగంగా ఈ క్రెడిట్ అవుట్‌రీచ్‌ను నిర్వహిస్తున్నారు.

దీనిలో ప్రధానమంత్రి ముద్రా యోజనా, స్టాండప్ ఇండియా, పిఎంఇజిపి, పిఎంఎస్‌విఎనిధి, ఇసిజిఎల్‌ఎస్, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, పిఎంఎఫ్‌ఎంఇ, హౌసింగ్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు వంటివి ఉంటాయి. పిఎంఎస్‌బివై, పిఎంజెజెబివై, పెన్షన్ స్కీమ్ ఎపివై వంటి సామాజిక భద్రత పథకాలపై అవగాహన, ఎన్‌రోల్‌మెంట్స్‌కు ప్రయత్నాలు చేపట్టనున్నారు. ఇంకా క్రెడిట్ అవుట్‌రీచ్‌లో భాగంగా డిజిటల్ అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఈ రుణ మేళ తొలుత మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో ఈనెల 20న నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఎస్‌ఎల్‌బిసి తెలంగాణ కోరింది.

ఇతర జిల్లాల్లో రుణ మేళా వివరాలు
అక్టోబర్ 21: సూర్యాపేట్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, ములుగు, నాగర్‌కర్నాల్, మంచిర్యాల్
అక్టోబర్ 22: వనపర్తి, నిర్మల్, ఆదిలాబాద్, జనగావ్, సిద్ధిపేట్
అక్టోబర్ 25: వికారాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి
అక్టోబర్ 26: పెద్దపల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, మహబూబాబాద్
అక్టోబర్ 27: నల్గొండ, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి,
అక్టోబర్ 28: రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, నారాయణ్‌పేట్, కామారెడ్డి, జగిత్యాల్
అక్టోబర్ 29: కొమరం భీమ్ అసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల

SLBC has been running credit outreach program from oct 20