Thursday, March 28, 2024

ఎముక ఆరోగ్యాన్ని పరిశీలించే చిన్న కంప్యూటర్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ఎముక ఆరోగ్యాన్ని, వాటిపై ఏర్పడే గాయాలను పర్యవేక్షించే సాధనం తయారీ దిశగా అమెరికా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. వీరు అత్యంత పలుచటి వైర్‌లెస్ సాధనాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని ఒసెయోసర్ఫేస్ ఎలక్ట్రానిక్స్‌గా పేర్కొంటున్నారు. ఆస్టియోపోరోసిస్ వంటి రుగ్మతల వల్ల ఎముకలు పెళుసుగా మారుతుంటాయి. దీనివల్ల బాధితులు ఎక్కువ రోజులు ఆస్పత్రిలో గడపాల్సి వస్తోంది.ఒసెయోసర్ఫేస్ ఎలక్ట్రానిక్స్ వంటి వైర్‌లెస్ సాధనాల వల్ల ఎముక ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంతోపాటు దాన్ని మెరుగుపరుచుకునేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘ ఎముక, కండరాల వ్యవస్థ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం చాలా ముఖ్యం.

ఈ సాధనాన్ని అమర్చడం ద్వారా ఎముకపై కంప్యూటర్‌ను ఏర్పాటు చేసినట్టే. ఎముకల వ్యవస్థ పనిచేసే తీరును అర్థం చేసుకోడానికి పరిశోధనాత్మక సాధనాల అభివృద్దికీ ఇది ఉపయోగపడుతుంది. వీటి ద్వారా సేకరించే వివరాలను చికిత్సకు వాడవచ్చు అని పరిశోధనలో పొలుపంచుకుంటున్న ఫిలిప్ గుట్రుప్ చెప్పారు. ఎముకలు, కండరాలకు చాలా దగ్గరగా ఉండడంతోపాటు తరచూ కదిలించాల్సి రావడం వల్ల ఈ సాధనాన్ని చాలా పలుచగా ఉంచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ సాధనంలో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అనే విధానాన్ని వాడడం వల్ల దీనికి బ్యాటరీ అవసరం లేదు. ఎముకకు బలంగా అతుక్కోడానికి కాల్షియం రేణువులతో ప్రత్యేక జిగురును అభివృద్ది చేశారు. అందువల్ల ఈ సాధనాన్ని తనలోని భాగం గానే ఎముక భావిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఫలితంగా ఆ రెండింటి మధ్య శాశ్వత బంధం ఏర్పడుతుందని చెప్పారు. దీర్ఘకాలం పాటు కొలతలు తీసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News