Friday, April 19, 2024

ఉచిత చేప పిల్లలతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతాం…

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను అభివృద్ధి చేసి, అంతిమంగా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడమే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లక్ష్యమని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.  ఆరో విడత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా నకిరేకల్ లోని పెద్ద చెరువులో చేప పిల్లలను మంత్రి జగదీష్ రెడ్డి వదిలారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే సిఎం కెసిఆర్ గ్రామీణ వృత్తుల అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించారని, అందులో భాగంగానే కుంచించుకుపోయిన చెరువులను మిషన కాకతీయ ద్వారా అభివృద్ధి చేసి, వాటిల్లో ఉచితంగా చేప పిల్లలను వదులుతూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంపి లింగయ్య యాదవ్, ఎంఎల్ఎ చిరుమర్తి లింగయ్య, మున్సిపల్ చైర్మన్, మత్స్య సహకారం సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News