Home తాజా వార్తలు ఉన్నతాధికారులతో స్మితాసబర్వాల్ సమీక్ష

ఉన్నతాధికారులతో స్మితాసబర్వాల్ సమీక్ష

IAS Smita Sabharwal

హైదరాబాద్: ఉన్నతాధికారులతో మిషన్ భగీరథ కార్యదర్శి స్మితాసబర్వాల్ సమీక్షించారు. ఇంటింటికి నల్లాతో నీరు సరఫరా అవుతున్న తీరుపై త్వరలోనే సర్పంచ్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, సోషల్ ఆడిట్ లో భాగంగా ప్రతీ ఇంటి నల్లా కనెక్షన్ ను వీడియో కాల్ తో పరిశీలిస్తామని స్మతాసబర్వాల్ అన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ప్రభుత్వం ఇంటింటికి మంచినీటిని అందిస్తోంది. పరిగి, గట్టు మండలాల్లోని ప్రజాప్రతినిధులకు మిషన్ భగీరథ నీటి వినియోగంపై అవగాహన కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చింది. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని మండల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, దసరా పండుగను దృష్టిలో ఉంచుకొని పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు స్మితాసబర్వాల్ సూచనలను జారీ చేశారు.

Smita Sabharwal meeting with superiors