Home తాజా వార్తలు సీతారామ ప్రాజెక్టు పనులపై స్మీతాసబర్వాల్ ఆగ్రహం

సీతారామ ప్రాజెక్టు పనులపై స్మీతాసబర్వాల్ ఆగ్రహం

Smita Sarkaraval fire on Seetharama project works

 

కొత్తగూడెం: సీతారామ ప్రాజెక్టు పనులు నత్త నడకన సాగుతున్నాయని, పనుల్లో వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మీతాసబర్వాల్ తెలిపారు. పనుల్లో జాప్యం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే సిబ్బంది వేతనాలు నిలుపుదల చేస్తామని అధికార్లను కఠినంగా హెచ్చరించారు. స్మితాసబర్వాల్ పర్యటనలో గతంలో ఎన్నడూ లేనంత ఆగ్రహించడంతో అధికారులు, కాంట్రాక్టు ఏజన్సీలు గడగడలాడిపోయారు. సైట్‌మేజర్లకు, ఇంజనీర్లకు మధ్య సమన్వయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె ప్రత్యేక హెలికాప్టర్‌లో మణుగూరు చేరుకొని, అశ్వాపురం మండంలోని బిజికొత్తూరు, పాల్వంచ మండలంలోని నాగారం, ముకలకపల్లి మండలంలోని వికే రామవరం, కమలాపురం గ్రామాల్లో జరుగుతున్న పంప్‌హౌస్ నిర్మాణ పనులు పరిశీలించారు. ప్రాజెక్టు మొదటి, రెండు, మూడు పంపుహౌస్‌ల నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని స్మితాసబర్వాల్ సూచించారు. సిసి కెమెరాలు హైదరాబాద్‌ లోని సిఎం కార్యాలయానికి అనుసంధానం ద్వారా పనులు నిరంతం పర్యవేక్షించే అవకాశం ఉంటుందన్నారు. బిజి కొత్తూరు వద్ద పంపుహౌసు పనులను పరిశీలించి, ఇక్కడ జరుగుతన్న పనులపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.

పంపుహౌసు పనులు అనుకున్న షెడ్యూల్ ప్రకారం వేగంగా జరగడం లేదని ఆమె అదికారులను నిలదీశారు. పనులు నత్తనడకన సాగడంపై ప్రాజెక్టు జనరల్‌మేనేజరు. సైట్ ఇన్‌చార్జలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీమీ జీతాల నుండి 15 రోజుల వేతనం కోతకు సిఫారసు చేస్తానని హెచ్చరిస్తూ పని తీరు మార్చుకోవాలని ఆమె సూచించారు. ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరగడానికి పలు సూచనలు చేశారు. ప్రాజెక్టు మొదటి, రెండుదశలకు ఆరు మోటార్లు, మూడవ దశకు ఏడు మోటార్లు, ఏర్పాట్లు చేయాల్సి ఉన్నట్లు వివరించారు. మొదటి దశ ఆగస్టు చివరినాటికి ట్రయల్ రన్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. గ్రావిటీ కెనాల్ 1,2,3,4 మరియు 7,8 పనులు అక్టోబర్ చివరినాటికి పూర్తి చేయాలని చెపాపరు. ప్రాజెక్టు పనులు చేసే మనుషులు చాలా తక్కువగా ఉన్నారని, తాను క్షేత్రస్థాయి పర్యటనలో స్వయంగా చూస్తున్నానని, ఎందుకు అధిక సంఖ్యలో మనుషులను పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మనుషుల సంఖ్య పెంచాలని, నిర్ధేశించిన షెడ్యూలు ప్రకారం ధర్మంగా చేయాలని, అవి ఇవీ లేవంటూ పనుల్లో ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ ఏజన్సీలను నిలదీశారు. ప్రతిరోజు చేయాల్సిన పనులు షెడ్యూలు ప్రభుత్వం ప్రకటించిందని, ఆ షెడ్యూలు ప్రకారం పనులు ఎందకు జరగటం లేదని మండిపడ్డారు. దశలవారిగా రోజుకు ఎంతపని చేయాల్సి ఉందనే అంశంపై ప్రణాళిక తయారు చేసుకుని, ఆ ప్రకారం చేస్తేనే పనులు త్వరగా పూర్తవుతాయని చెప్పారు. ఇప్పటినుండైనా ప్రణాళిక ప్రకారం పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సివిల్ పనుల్లో వేగం పెంచాలని రానున్న వర్షాకాలం వరకు సివిల్ పనులు పూర్తీ చేయకపోతే , వర్షాల వల్ల ఇబ్బందులు వస్తాయని చెప్పారు. బిజి కొత్తూరుకు వస్తున్నప్పుడు పరిశీలించగా , కాలువ పనులు జరగటం లేదని ఒక్క మనిషి కూడా కాలువ పనులు చేయటం లేదని ప్రశ్నించారు. సిబ్బంది క్షేత్ర స్ధాయిలో ఉండి పనులు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌శైని, సిఎం ఓ ఓఎస్డీ పెద్దారెడ్డి, ఈఈ నాగేశ్వరరావు మేగా , ప్రతిమ ఏజేన్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Smita Sarkaraval fire on Seetharama project works