Friday, April 19, 2024

కోహ్లి కంటే స్మిత్ బెటర్

- Advertisement -
- Advertisement -

ముంబై : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పోల్చితే టెస్టుల్లో ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ ఉత్తమ బ్యాట్స్‌మన్ అనడంలో సందేహం లేదని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. కొంతకాలంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా మాజీ సారధి స్టీవ్ స్మిత్‌ల మధ్య ఎవరూ గొప్ప అనే చర్చ జరుగుతోంది. పలువురు క్రికెటర్లు వీరిలో ఎవరూ ఉత్తమ బ్యాట్స్‌మన్ అనే విషయంలో తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తూనే ఉన్నారు. కొందరూ విరాట్‌ను అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా పేర్కొంటుండగా, మరికొందరూ స్మిత్‌కు మద్దతు తెలుపుతున్నారు. ఇక, టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా వీరిలో ఎవరూ ఉత్తమం అనే విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. విరాట్‌తో పోల్చితే ఆస్ట్రేలియా స్టార్ స్మిత్ ఉత్తమ బ్యాట్స్‌మన్ అని పేర్కొన్నాడు. నిషేధం తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన స్మిత్ నిలకడైన ఆటతో చెలరేగి పోతున్నాడన్నాడు. ఒత్తిడిలోనూ ఏమాత్రం అధైర్య పడకుండా పరుగుల వరద పారిస్తున్నాడన్నాడు. దీంతో తాను స్మిత్‌కే ఉత్తమ బ్యాట్స్‌మన్ హోదాను ఇస్తున్నట్టు జాఫర్ వివరించాడు. టెస్టుల్లో స్మిత్ పైచేయి సాధించినా వన్డేలు, టి20లకు వచ్చే సరికి విరాట్ ఉత్తమ బ్యాట్స్‌మన్ అని జాఫర్ వివరించాడు. మరోవైపు మూడు ఫార్మాట్‌లలో బ్యాటింగ్‌ను పరిగణలోకి తీసుకుంటే మాత్రం కోహ్లికి ఎదురు ఉండదని జాఫర్ స్పష్టం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News