Saturday, April 20, 2024

తెలంగాణ అభివృద్ధిపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి

- Advertisement -
- Advertisement -
Smriti Irani Speech in BJP Public Meeting In Husnabad
18 కోట్ల మంది పేదలకు 14 నెలలు ఉచితంగా రేషన్ అందిస్తోంది
హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపును ఎవ్వరూ ఆపలేరు : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

మనతెలంగాణ/ హుస్నాబాద్/ అక్కన్నపేట : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి సారించి అత్యధిక నిధులు కేటాయిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ శనివారం ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో అన్నారు. హుజురాబాద్‌లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని. కెసిఆర్ రాజ్యాంగమే అమలవుతుందన్నారు. రాష్ట్రంలో అవినీతి నియంత పాలనకు చరమ గీతం పాడేందుకు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు ఆశీర్వదించేందకు వచ్చిన ప్రజలకు వందనాలు తెలిపారు. నీళ్లు నిధులు నియామకాల లక్షంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి సంక్షేమానికి అనేక నిధులు ఇస్తుందన్నారు. 2016లో రామగుండం ఎరువుల ప్యాక్టరీని పునరుద్దరించి 12 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థంతో నిర్మించిన ఈ ప్యాక్టరీని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో త్వరలో పునః ప్రారంభం కాబోతుందన్నారు. 18 కోట్ల మంది పేదలకు 14 నెలలుగా ఉచితంగా రేషన్ అందిస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్నారు.

20 నెలలైనా తెలంగాణ నిరుద్యోగులకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి అమలు కావడం లేదన్నారు. దళితుల అభ్యున్నతి కోసం రూ. 25 వేల కోట్ల నిధులను వెచ్చించారు. స్టాండప్ ఇండియా స్కీం పేరుతో దళితులను పారిశ్రామిక వేత్తలను మోసం చేశారన్నారు. దేశ వ్యాప్తంగా 14 కోట్ల మంది రైతులకు భూసార పరీక్షల కోసం కార్డులిచ్చింది. ఫసల్ భీమా యోజన పథకం అమలు చేస్తుంటే కేసీఆర్ మాత్రం ఇక్కడి రైతులకు ఫసల్ భీమాయోజన పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. భూసా ర పరీక్షలు నిర్వహించడం లేదని తెలిపారు. అయుస్మాన్ భారత్ పేరుతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ. 5లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తుంటే కేసీఆర్ మాత్రం ఆపథకాన్ని అమలు చేయకుండా పేదల ఆరోగ్యాన్ని గాలికోదిలేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నియంత అవినీతి పాలనను ఎండట్టేందుకు కేంద్ర పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు బండి సంజయ్ చేపట్టిన తొలిదశ ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయవంతమైందన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హాంమంత్రి అమిత్‌షా, బిజేపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా బండి సంజయ్‌ను అభినందించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ ప్రజా సంగ్రామ యాత్రను ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు కార్యకర్తలకు శిరస్సు వంచి దన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇదే పోరాటాల పురిటిగడ్డ హుస్నాబాద్ ఇక్కడి నుండే సమర శంఖం పూరిస్తున్నామన్నారు. ఇక్కడి ప్రజల జోష్ చూస్తుంటే 2023లో అధికారం బిజేపిదే అని అర్ధం అవుతుందన్నారు. ఈ పాదయాత్ర 38 రోజులు, 8 జిల్లాలు, 19 అసెంబ్లీ , 6 ఎంపీ స్థానాల్లో తిరిగిన ఎక్కడికి వెళ్లినా ప్రజలునానా కష్టాలు పడుతున్నారు. నేను స్వయంగా పరిశీలించానని అన్నారు. రైతుల బాధలు వర్ణణాతీతం వరి వేస్తే ఉరి గతి అంటే రైతులు వ్యవసాయం చేయకుండా కేసీఆర్ అడ్డుకునే యత్నం చేస్తున్నారన్నారు.

హుజురాబాద్ లో బిజేపి గెలుపును ఎవ్వరు ఆపలేరన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ ంఎన్ని కుట్రలు చేసిన బిజేపికి ఓట్లు వేయడం ఖాయమన్నారు. హుజురాబాద్‌లో ఈటెల రాజేందర్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాకే విజయ యాత్ర పేరుతో ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టి తీరుతామన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి శాసన సభాపక్షనేత రాజాసింగ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News