Home నల్లగొండ దర్జాగా రేషన్ బియ్యం దోపిడి

దర్జాగా రేషన్ బియ్యం దోపిడి

అనర్హుల చేతిలో అన్నపూర్ణ కార్డులు
సగానికి పైగా దుర్వినియోగం
పేదల బియ్యాన్ని తన్నుకుపోతున్న పెద్దలు
అధికారుల అండతోనే అక్రమార్కుల దందా
చెక్కు పెట్టేందుకు సర్కారు సమాయత్తం

RICE

మన తెలంగాణ / నల్లగొండ : పేదలకే దక్కాల్సిన సంక్షేమ పథకాలు పక్కదారి పడుతున్నాయి. ముఖ్యంగా నిత్య వసరాలు పక్కదారిపడుతుండటంతో ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. పేదలకు రేషన్‌బియ్యాన్ని అందజేయ కుండా అధికారుల అండదండలతో కొందరు అక్రమా ర్కులు దారిమళ్లించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకపోగా పైపెచ్చు అక్రమార్కులు డీఎస్‌వో, సివిల్ సప్లై కార్యాలయాల చుట్టూ దర్జాగా తిరుగుతుండటంతో ఉన్నతాధికారులు కంగు తింటున్నారు.

చౌక ధరల దుకాణాల ద్వారా తెల్లరేషన్ కార్డు దారులకు రూ.1కే కిలో బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన బియ్యాన్ని దళారులకు రూ.10 నుండి రూ.12లకు విక్రయిస్తున్నారు. లబ్దిదారులు కొంత మంది ఇదే పనిగా పెట్టుకొని విక్రయిస్తుండటంతో నిజమైన అర్హులైన లబ్దిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో 9,92,982 కుటుంబాలకు ఆహార భద్రతా కార్డులున్నాయి. ఇందులో అంత్యోదయ, అన్న పూర్ణ కార్డులు 62,159 కార్డులు ఉన్నాయి. ప్రతీ నెలా 18607.100 మెట్రిక్ టన్నులు బియ్యం ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ప్రస్తుతం జిల్లాల విభజన తర్వాత నల్లగొండ జిల్లాలో కేవలం 4,50,400 ఆహార భద్రతా కార్డుల ద్వారా ప్రతీ మనిషికి ఆరు కేజీల చొప్పున ప్రతీ నెలా రూపాయికి కిలో బియ్యం సరఫరా చేయడం జరుగుతుంది. ఇందులో అనేక మంది రూపాయి కిలో బియ్యం దొడ్డుగా ఉండటంతో రేషన్ డీలర్ల వద్ద తీసుకున్నా బయట వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. లబ్దిదారులు అనేక మంది ఇదే పనిగా పెట్టుకొని విక్రయిస్తుండటంతో నిజమైన అర్హులైన లబ్దిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.

నెలకోసారి ఇచ్చే బియ్యాన్ని జాగ్రత్తగా వాడుకుంటున్న వారు లేకపోలేదు. ఇదిలా ఉండగా బయట దళారులు పేదల బియ్యంపై కన్నేశారు. చిన్నవ్యాపారుల నుంచి టోకుగా కొనుగోలు చేసి అవే బియ్యాన్ని పాలీష్‌చేసి తిరిగి ప్రభుత్వానికే అమ్ము తున్నారన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. అన్నపూర్ణ, అంత్యోదయ కార్డుల ద్వారా ఒక్కొక్క రికి నెలకు ఉచితంగా పది కేజీల బియ్యాన్ని సరఫరా చేస్తారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అనాదలు, ఏ ఆసరా లేనివారికి దక్కాల్సిన ఈ బియ్యం ఉన్నత వర్గాలకు అందడంతో అక్రమాలకు పాల్ప డుతున్నారు. వీరి ఆగడాలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం బోగస్ కార్డుల ఏరివేతకు చర్యలు చేపట్టింది. రేషన్ షాపు డీలర్‌లు తమ వద్ద ఉన్న కొద్దో గొప్పో కార్డులను అప్పగించి పెద్ద ఎత్తున కార్డులను తమ వద్దే ఉంచుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 30న నల్లగొండ జిల్లా దేవర కొండ పట్టణంలో 400 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధి కారులు పట్టుకున్న విషయం తెలిసిందే. గతంలో చౌటు ప్పల్, నార్కట్‌పల్లి, హుజుర్‌నగర్ ప్రాంతాల్లో వందలాది క్వింటాళ్ల బియ్యం పట్టుబడిన విషయం విధితమే. తక్కువ ధరకు కొనుగోలు చేసిన పీడీఎస్ బియ్యాన్ని ఇతర రాష్ట్రా లకు తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుం టున్నారు. డీలర్లు, సంబంధిత అధికారులు ధళారులతో చేతులు కలిపి రేషన్ బియ్యాన్ని మూడో కంటికి తెలియకుండా మాయం చేస్తున్నారు. రేషన్‌బియ్యాన్ని కోళ్లఫామ్‌లో కోళ్లకు దాణాగా ఉపయోగిస్తున్నారు. కొంతమంది దళారులు అదే బియ్యాన్ని రిసైక్లింగ్ చేసి సన్నబియ్యం పేరుతో కాకినాడ ఓడరేవు కేంద్రంగా ఇతర దేశాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకొని పేదలకు పూర్తిస్థాయిలో రేషన్ బియ్యం అందే విధంగా చూడాలని పలువురు కోరుతున్నారు.