Friday, March 29, 2024

గూగుల్ ఉద్యోగులకు స్నాక్స్ కట్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ)పై దృష్టి పెట్టిన గూగుల్ ఇప్పుడు ఖర్చులను తగ్గించునే చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఉద్యోగులకు ఇచ్చే చిరుతిళ్లు, లాండ్రీ సర్వీస్, కంపెనీ మధ్యాహ్న భోజనాలు వంటి వాటిని నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది. వ్యయ నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సిఎఫ్‌ఒ) రూత్ పోరట్ ప్రకటించారు. మరోవైపు ఖర్చులను తగ్గించుకునేందుకు కొత్త ఉద్యోగుల నియామకాలు కూడా నిలిపివేస్తున్నామని ఆయన వెల్లడించారు. దీనిలో భాగంగా కొంత మంది ఉద్యోగులను ఇతర విభాగాల్లోకి బదిలీ చేయాలని కంపెనీ యోచిస్తున్నట్టు సమాచారం. ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లను కూడా కంపెనీ తగ్గించింది. మాంద్యం నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునే క్రమంలో కంపెనీ ఇప్పటికే 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది.
త్వరలో ‘బ్రాడ్’కు అప్‌గ్రేడ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) బాట్ బార్డ్‌కు త్వరలో అప్‌గ్రేడ్‌ను ప్రారంభిస్తామని గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఒక ఇంటర్వూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. గత నెలలో బ్రాడ్‌ను ప్రవేశపెట్టారు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన చాట్ జిపిటికి పోటీగా కన్వర్జేషనల్ చాట్‌బోట్‌ను తీసుకురావాలనేది లక్షంగా ఉంది. గూగుల్ ఎఐపై ముందుకు సాగుతుంతదని పిచాయ్ చెప్పారు.- మరింత సామర్థ్యం గల మోడల్స్ స్పష్టంగా ఉన్నాయని, త్వరలో బార్డ్‌ని మరింత సమర్థవంతమైన పాత్‌వే లాంగ్వేజ్ మోడల్ (పిఎల్‌ఎం)కి అప్‌గ్రేడ్ చేస్తామని ఆయన తెలిపారు. ఇది మరిన్ని సామర్థ్యాలను తెస్తుంది.

రీజనింగ్‌లో, కోడింగ్‌లో ఏదైనా సరే, ఇది గణిత ప్రశ్నలకు మెరుగైన సమాధానాలను ఇవ్వగలదని అన్నారు.- వచ్చే వారంలో పురోగతిని చూస్తారు. టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 2 వేల మందికి పైగా పరిశోధకులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఎఐ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఎఐప్రాజెక్ట్‌ను ఆరు నెలల పాటు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి పిచాయ్ తన కంపెనీ మరింత సామర్థ్యం గల ఎఐ మోడల్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. చాలా మంది నిపుణుల విజ్ఞప్తిని విస్మరించలేమని, అయితే ఎఐ ప్రపంచాన్ని మెరుగుపరచగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున దానిని కూడా వదిలివేయలేమని పిచాయ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News