Home తాజా వార్తలు దంపతులు, కుమారుడిని కాటేసిన పాము

దంపతులు, కుమారుడిని కాటేసిన పాము

 

మహబూబాబాద్: ఒకే కుటుంబంలో ముగ్గురిని పాము కాటు వేయడంతో అందులో ఒకరు మృతి చెందగా ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యర్రచక్రతండా వాసులు తెలిపిన వివరాల ప్రకారం….  నర్సింహులపేట మండలం రూప్లాతండా గ్రామంలో జాతోటు రవి(45), భార్య నీల(40), కుమార్తె, కుమారుడు మంచంపై నిద్రిస్తున్నారు. వాళ్లు అన్నం తిన్న తరువాత మంచంపై పడుకోగానే తొలుత రవిని, తరువాత నీల, శరణ్ ను కాటువేయడంతో ఎదో కరిచిందని కేకలు వేశారు. గ్రామంలో మంత్రగాడు ఇచ్చిన చెట్ల మందులను తీసుకున్నారు. కానీ అప్పటికే రవి పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీంతో నీల, శరణ్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వాళ్ల పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. దీంతో రూప్లాతండా గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. 

 

Snake Bite Three Persons in Mahabubabad