Home ఆంధ్రప్రదేశ్ వార్తలు కారు ఇంజిన్‌లో పాము కలకలం

కారు ఇంజిన్‌లో పాము కలకలం

snake

 

తిరుపతి: తిరుమలలో కారులో ఓ పాము కలకలం రేపింది. అగివున్న కారు బ్యానెట్ లోకి పాము దూరి ఇంజిన్ దగ్గర తలదాచుకుంది. పాము తోక బయటకు కనిపించడంతో డ్రైవర్ కంగారుపడి స్థానికుల సహయంతో బయటకు వెళ్లగొట్టడానికి ప్రయత్నించినప్పట్టికి బయటికి రాలేదు. కారులో పాము కనిపించడంతో భక్తులు ఆందోళన పడడంతో వేంటనే డ్రైవర్ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో సిబ్బంది అక్కడికి చేరుకొని చాకచక్యంగా పామును బయటకు తీశారు.  పామును బయటకు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ… తిరుమలలో దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పాములు, అడవి జంతువులు సంచరించడం సర్వసాధారణమే అన్నారు. తిరుమల భక్తులు ఎలాంటి భయభ్రాంతులకు గురికావొద్దని, ఒంటరిగా సంచరించక వద్దని గంపులుగా వెళ్లాలని అధికారులు కోరారు.

snake found in car bonnet at tirumala