Friday, April 26, 2024

మధ్యాహ్నం భోజనంలో పాము….. 25 మంది విద్యార్థులకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

పాట్నా: ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పాము కనిపించిన సంఘటన బీహార్ రాష్ట్రం అరారియా జిల్లా ఫర్‌బిస్‌గంజ్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. జోగ్‌బాని సెకండరీ స్కూలు విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేస్తుండగా ఓ విద్యార్థి ప్లేటులో పాము కనిపించింది. అప్పటికే కొందరు విద్యార్థులు భోజనం చేశారు. పాము కనిపించిన సంఘటన వెంటనే వైరల్ గా మారింది. భోజనం చేసిన 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో పాటు వాంతులు చేసుకున్నారు. వంద మంది విద్యార్థలు స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారని స్థానిక మీడియా వెల్లడించింది. వెంటనే వారిని ఫోర్బ్స్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. భోజనం పాఠశాలలో వండలేదని ఓ కాంట్రాక్టర్ సరఫరా చేసినట్లు సిబ్బంది తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పాఠశాల వద్దకు తల్లిదండ్రులు, స్థానికులు చేరుకొని ఆందోళన చేశారు. ఓ ఎన్జీఓ సంస్థ, వంటలు వండే సిబ్బందిపై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: తొమ్మిదేళ్ళ పాలనపై పది సందేహాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News