Home ఆంధ్రప్రదేశ్ వార్తలు మరుగుదొడ్డిలో పాము…

మరుగుదొడ్డిలో పాము…

Snakeనెల్లూరు : బడి మరుగుదొడ్డిలో ఓ ఆరడుగుల తాచు పాము ప్రత్యక్ష్యమైంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన ఆత్మకూర్ మండలం కరటంపాడు ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. తాచుపాము పాఠశాల మరుగుదొడ్డిలో దూరింది. అయితే తలుపులు మూసుకపోవడంతో బయటకు రాలేకపోయింది. మరుగుదొడ్డి నుంచి శబ్ధాలు రావడంతో స్థానికులు వచ్చి తలుపులు తీశారు. ప్రజల చూసిన పాము పారిపోయేందుకు ప్రయత్నించింది. మరుగుదొడ్డి వెంటిలేటర్ రంధ్రం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించి అందులో ఇరుక్కపోయింది. ఈ క్రమంలో ఆ పాము చనిపోయింది.

Snake In Toilet At Nellore