Home తాజా వార్తలు విరిగిపడిన మంచు చరియలు

విరిగిపడిన మంచు చరియలు

SNOW

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో మరోసారి మంచు చరియలు విరిగిపడి ఇద్దరు జవాన్లు గల్లంతయ్యారు. గురేజ్ సెక్టార్‌లోని 51వ రాష్ట్రీయ రైఫిల్స్ ఆర్మీ సైనికుల స్థావరంపై మంచు చరియలు విరిగిపడడంతో ఇద్దరు జవాన్లు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన జవాన్ల కోసం గాలిస్తున్నామని వారు వెల్లడించారు. బుధవారం సైనిక శిబిరంపై మంచు చరియలు విరిగిపడడంతో ఆరుగురు జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ శిబిరంలో సైనికాధికారి అమిత్‌తో పాటు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు.